ఓం త్ర్యయంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్ధనం |
ఉర్వారుకమివబంధనాత్ మౄత్యోర్ముక్షీ యమామౄతాత్ ||
మౄత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమ్రుతేశాయ శర్వాయ మహాదేవాయతే నమహ ||

Thursday, December 8, 2011

సుధా సరాగం....

కడతేరని నా కలల వైభోగం
నిజజీవితపు ప్రతి మలుపులో అది నిరుపయోగం
సాగని తలంపుల నా ప్రేమ విహంగం
తనకై ఎదురుచూస్తూ పాడుతూనే ఉంటుంది ఈ సుధా సరాగం....

మరుపురాని కలల సంద్రాన నావ సుధ సంపదలతో వస్తుందనుకున్నా
అలల ముద్దాడు చిరుగాలుల కొంతసేపు రెపరెపమని నవ్వె నా నావ తెరచాప
కాలం కలిసొచ్చి అంతా సవ్యంగాసాగుంటే చేరేది ఆనంద తీరాన
కాని శిథిలమైన ప్రేమ సుడిగుండాల చేతచిక్కి
విసిగివేసారి ఒరిగింది నా నావ ఓ పక్కన ఏదో దిక్కున.........

చెంత చేరు సమయాన చేతకానివాడిల చేజార్చుకున్నా
వేచిచూడు సమయాన వేదనతో వదులుకున్నా ....
గతించని స్మృతుల వేగానికి తలొంచుకు నిలబడుతున్నా
జీవం చచ్చిన ప్రేమకి ప్రాణం పోసే సుధనే వరమడుగుతున్నా...

1 comment:

  1. భావాల కోసం అక్షరాన్ని ప్రేమించావు బాగుంది!
    ప్రేమించిన అక్షరాలతో విరహాన్ని నిమ్పావేమి ?
    అయినా నిన్ను చేరే జాబిలికోసం వేచి చూడు
    కాని నీ చెంతకు రాని వెన్నల కోసం కాదు ....

    ReplyDelete