ఓం త్ర్యయంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్ధనం |
ఉర్వారుకమివబంధనాత్ మౄత్యోర్ముక్షీ యమామౄతాత్ ||
మౄత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమ్రుతేశాయ శర్వాయ మహాదేవాయతే నమహ ||

Monday, January 23, 2012

ధైర్యం

కనేటప్పుడు అమ్మకు తెలియదు
పుట్టేటప్పుడు బిడ్డా అడగడు
పెరిగేటప్పుడు నాన్నైనా తెలుపడు
ఏనాటి పాపమో ఈనాటి శాపమైతే
మనసెరిగిన మగువ మనువాడే సమయానికి
జాతకాల నలుపు ఓ మనిషినే అంటితే
విధాత రాసిన ఆ రాతకు విలపించేదెందుకు
విడదీసిన ఈ విధిని నిందించేదెందుకు
తన ప్రేమ నిజమైతే దరి చేరదా ఒకనాటికి
తనకై అలుపెరుగక వేచి చూస్తుంటాడు ఏనాటికీ

ఆనందం

రాగాల కోయిల గొంతు మూగబోయినట్లు
కొడిగట్టిన దీపం మసకబారినట్లు
చిగురించే చిరుకొమ్మల ఆకులు రాలినట్లు
జీవితాన అలుపెరుగని నాకు....
నా చివరి మజిలీ తలుపులు తెరుచుకున్నట్లు
నా చితిమువ్వల సవ్వడులే వినబడుతున్నాయి
నా కాటి కాపురాల కథలే కనబడుతున్నాయి
నా స్నేహితులే నా కాడె బరువు మోయగా....
ఓ మిత్రుడే నా చివరి మలుపు నిప్పుని రాజేయగా.....
ఆ అందాల కడలి అలల్నే నా కలలు చేరగా.....
నా ఆద్యంతం అణువణువై అందరి మది చేరనా......
కనీసం వత్సరానికి ఒక మారు మీ మాటల పాటల్లో వినబడనా.........