ఓం త్ర్యయంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్ధనం |
ఉర్వారుకమివబంధనాత్ మౄత్యోర్ముక్షీ యమామౄతాత్ ||
మౄత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమ్రుతేశాయ శర్వాయ మహాదేవాయతే నమహ ||

Monday, January 25, 2016

తెలుసుకో మిత్రమా తెలుసుకో...............

కలికాలపు ఘీంకారం, నశియించిన మమకారం
సమాజంపై వికారం,కోల్పోయిన సహకారం
అత్యాసల అంధకారం,అధికార అహాంకారం
కడకు మనుగడకై ప్రకృతిపై ధిక్కారం

తెలుసుకో మిత్రమా తెలుసుకో

హూంకరించి  వచ్చు ప్రళయ విళయ గర్జనల
కడలి అలలు ఎగసినపుడు
పుడమితల్లి చీలినపుడు
చినుకు చినుకు కలిసి వరదై ముంచినపుడు
పిల్లగాలి సుడులు తిరిగి పెనుగాలై కమ్మినపుడు
వెన్నెలే ఎరుపెక్కి భూమంతా మండినపుడు

తెలుసుకో మిత్రమా తెలుసుకో

నీ తలరాతలు కడ గీతకు చేరినపుడు
మరణమంచుల మృత్యువుకు సాగిలపడినప్పుడు
అంత్యఘడియ  ఉసురు ఆవిరౌ వేళ
బలమాపున నీకలిమి,కలిమాపున నీ దేహం
దేహమాపున నీ కులం, కులమాపున నీ మతం
ఎవ్వరాపు నీ ప్రాణం, ఏదాపును నీ చావు
ఎందుకీ ఆరాటం ,ఎవ్వరిపై  నీ పోరాటం ....

మార్చుకో నీ పంధా ఈరోజున నీ రోజై ........
తెలుసుకో మిత్రమా తెలుసుకో..

కార్తీక్ మైనంపాటి