ఓం త్ర్యయంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్ధనం |
ఉర్వారుకమివబంధనాత్ మౄత్యోర్ముక్షీ యమామౄతాత్ ||
మౄత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమ్రుతేశాయ శర్వాయ మహాదేవాయతే నమహ ||

Thursday, December 8, 2011

సుధా సరాగం....

కడతేరని నా కలల వైభోగం
నిజజీవితపు ప్రతి మలుపులో అది నిరుపయోగం
సాగని తలంపుల నా ప్రేమ విహంగం
తనకై ఎదురుచూస్తూ పాడుతూనే ఉంటుంది ఈ సుధా సరాగం....

మరుపురాని కలల సంద్రాన నావ సుధ సంపదలతో వస్తుందనుకున్నా
అలల ముద్దాడు చిరుగాలుల కొంతసేపు రెపరెపమని నవ్వె నా నావ తెరచాప
కాలం కలిసొచ్చి అంతా సవ్యంగాసాగుంటే చేరేది ఆనంద తీరాన
కాని శిథిలమైన ప్రేమ సుడిగుండాల చేతచిక్కి
విసిగివేసారి ఒరిగింది నా నావ ఓ పక్కన ఏదో దిక్కున.........

చెంత చేరు సమయాన చేతకానివాడిల చేజార్చుకున్నా
వేచిచూడు సమయాన వేదనతో వదులుకున్నా ....
గతించని స్మృతుల వేగానికి తలొంచుకు నిలబడుతున్నా
జీవం చచ్చిన ప్రేమకి ప్రాణం పోసే సుధనే వరమడుగుతున్నా...

గతి లేని యుద్ధంలో..........

గతి లేని యుద్ధంలో మతి లేని యోధుడినై
కానరాని గమ్యంతో కలిసిరాని కాలంలో
ఒంటరిగా మిగిలి పోరాడుతున్నా.........
కవచాలే ఊడుతున్నా కత్తులే గుచ్చుకుంటున్నా
కండలే తెగుతున్నా రెండు కళ్ళూ వాలుతున్నా
మరణం మాసిపోని నిజమై తరుముతూ పలకరిస్తున్నా
చివరి మజిలీ చేరే వరకు ఈ పోరు ఆగదు
ఏదేమైనా నా జీవన రాజ్యాన రాజునూ నేనే...
ఆ నీలి గగనంలో మెరిసేటి నెలరాజునూ నేనే...

జాతస్యహిధృవోమృత్యుహు ధృవంజన్మమృతస్యచ |
తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి ||

Monday, October 24, 2011

తలంపు తలచినా

తలంపు తలచినా కలలో భ్రమించినా ఆ వనిత
వీడిన కుసుమంతో జతకోరనిదీ ఆ లత
ఇలా ఎన్ని పదాలు ఏర్చి కూర్చినా తిరిగి రాయలేనిది నా తలరాత
నా ఈ గతిని మార్చ గలిగింది స్రుస్టికారక ఆ విధాత

శభాష్ నీ మొహమ్మండ....................నీ ఈ కవిత

నాభావం.....

నా భావానికి లేదు భాష
నా కవిత్వానికి లేదు సోష
మీరందరు నవ్వాలనేది నా ఆశ
అందుకే దీన్ని మీకోసం రాసా
అలసి సొలసి ఇప్పటికి ఈ కవితని ఆపేసా ...


మౌనమే భాషగా మిగిలిన నేను

మౌనమే భాషగా మిగిలిన నేను
నావేదనను ఎలా నివేదించను
గమ్యం లేని మజిలీలో ఓ వసంతమా
ఎలా చూపను నీ పై నా ప్రేమను

... తోడు నీడ అన్నావు నీతోనే జీవితం అన్నావు
నావకు చుక్కానిలా కనిపించి నడి సంద్రంలో ముంచావు
బాధలు రోధనలు మిగిల్చి ఆనంద తీరాలకేగే ఓ ప్రియతమా
నావేదనను ఎలా నివేదించను ఎలా చూపను నీ పై నా ప్రేమను

విధాత రాతతో విది చేతిలో ఓడిన నేను
సంతోషాల సుధలతో మరో ఇంట అడుగిడాలనుకునే నీకు
కాలగమనంలో కరిగిపోని కన్నీటిని కానుకగా ఇవ్వనా
చరిత్ర పుటల్లో చెరిపివేయబడ్డ మన రెండక్షరాల జ్ఞాపకాలను బహుమతిగా ఇవ్వనా
కడవరకు నీకై ఎదురుచూసే నేను ఏమివ్వగలను ఇంతకన్నా